మిరప మొలకెత్తలేదని ఆందోళన
eenadu telugu news
Published : 24/07/2021 03:59 IST

మిరప మొలకెత్తలేదని ఆందోళన


విత్తన దుకాణం ఎదుట బైఠాయించిన రైతులు

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన మిరప విత్తనాలు మొలకెత్తలేదని ఖమ్మం నగరంలోని ఓ విత్తన దుకాణం వద్ద రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. నగరంలోని గాంధీచౌక్‌ రాజీవ్‌గంజ్‌లోని వెంకటకృష్ణ ఏజెన్సీస్‌ ఎదుట రైతులు కొద్ది సేపు బైఠాయించారు. చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన రైతులు సిగ్నస్‌ కంపెనీకి చెందిన కాకతీయ మిరప విత్తనాలను కొనుగోలు చేశారు. లాట్‌నెంబరు 1238కి చెందిన విత్తనాలను డీలరు రైతులకు విక్రయించాడు. అయితే విత్తనాలు వేసిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు మొలక రాకపోవటంతో రైతులు ఈవిషయం సంబంధిత డీలరు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవటంతో సుమారు పది మంది రైతులు ఉదయం దుకాణం ఎదుట ఆందోళన చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించిన డీలరుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం ఖమ్మం అర్బన్‌ ఏవో కిశోర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని డీఏవో ఎం.విజయనిర్మల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన డీఏవో వెంటనే క్షేత్రపరిశీలన చేయాలని కోరారు. గ్రామంలోని పొలాలను పరిశీలించి వెంటనే నివేదిక అందజేయాలని ఏఓ, నియోజకకవర్గ ఉద్యాన అధికారులను ఆదేశించారు. వీరు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారని ఏవో కిశోర్‌బాబు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని