లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు: కలెక్టర్‌
eenadu telugu news
Published : 24/07/2021 03:56 IST

లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు: కలెక్టర్‌

ఖమ్మంలోని మున్నేరు వంతెన సమీపంలో పర్యటిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, నగర కమిషనర్‌ అనురాగ్‌ జయంతి

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మున్నేరు వరద పెరిగే క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఇందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో మున్నేరు ముంపు ప్రాంతాలైన బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్‌ లోతట్టు ప్రాంతాలను కలెక్టర్‌ గౌతమ్‌ శుక్రవారం సందర్శించారు. మున్నేరు వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మున్నేరు నీటి ప్రవాహం, లోతట్టు ప్రాంతంలోని నివాసాలు, అక్కడి రహదారులు, డ్రైయిన్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద పెరిగితే అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, నీటిపారుదల శాఖ సీఈ శంకర్‌నాయక్‌, ఆర్డీవో రవీంద్రనాథ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ శైలజ, స్థానిక కార్పొరేటర్‌ మాటేటి అరుణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని