ఐటీడీఏ ఏపీవో జనరల్‌గా డేవిడ్‌రాజ్‌
eenadu telugu news
Published : 24/07/2021 02:35 IST

ఐటీడీఏ ఏపీవో జనరల్‌గా డేవిడ్‌రాజ్‌

భద్రాచలం, న్యూస్‌టుడే: ఐటీడీఏ ఏపీవో జనరల్‌గా డేవిడ్‌రాజ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పీవో గౌతమ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మూడేళ్ల క్రితం ఇక్కడ గణాంక అధికారి(ఎస్వో) నుంచి ఏపీవో జనరల్‌గా ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించారు. మన్యం పాలనపై అవగాహన కలిగిన అధికారిగా ఈయనకు గుర్తింపు ఉంది. ఇటీవల ఇక్కడి ఏపీవో జనరల్‌ నాగోరావును పీవో సరెండర్‌ చేశారు. అప్పటి నుంచి ఏవో భీమ్‌ ఇంఛార్జి ఏపీవో జనరల్‌గా కొనసాగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని