ఆపత్కాలంలో ‘డయల్‌-100’ను సంప్రదించాలి: ఎస్పీ
eenadu telugu news
Published : 24/07/2021 02:35 IST

ఆపత్కాలంలో ‘డయల్‌-100’ను సంప్రదించాలి: ఎస్పీ


మాట్లాడుతున్న ఎస్పీ సునీల్‌దత్‌

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: ముంపు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. అత్యవసర సాయం కోసం ఎవరైనా ‘డయల్‌-100’కి ఫోన్‌ చేయాలన్నారు. సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులతో శుక్రవారం ఆయన తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను స్థానిక పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా అందించాలన్నారు. ఇతర శాఖలతో సమన్వయంగా వ్యవహరించాలన్నారు. అనంతరం అపరిష్కృత కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ కేఆర్‌కే.ప్రసాద్‌, మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌, ఏఎస్పీ రోహిత్‌రాజు, కొత్తగూడెం, ఇల్లెందు డీఎస్పీలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని