పాపం.. ఆదుకోండి
eenadu telugu news
Updated : 24/07/2021 12:02 IST

పాపం.. ఆదుకోండి

మెదడులో ఇన్ఫెక్షన్‌

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాత్విక

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: రెండేళ్ల చిన్నారికి పెద్దకష్టం వచ్చింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వారి పాపకు జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చగా మెదడులో ఇన్ఫెక్షన్‌ ఉందని వైద్యులు తేల్చారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు శక్తికి మించి ఖర్చు చేశారు. ఇంకా వైద్యం కోసం డబ్బు అవసరం ఉండటంతో దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి... సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఆనెపు శ్రీకాంత్‌, కృష్ణవేణిలకు రెండేళ్ల చిన్నారి సాత్విక ఉంది. భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో ఉండే అమ్మమ్మ, తాతయ్యల వద్ద చిన్నారి ఉంటోంది. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో చిరుద్యోగం చేసుకుంటున్నారు. ఇటీవల చిన్నారికి జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెదడులో మూడు చోట్ల ఇన్ఫెక్షన్‌ ఉందని వైద్యులు చెప్పారు. చికిత్సకు బంధువుల సాయంతో ఇప్పటివరకు రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇంకా నగదు కావాల్సి ఉందని వైద్యులు చెబుతుండగా.. తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేసి చిన్నారిని బతికించాలని వేడుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని