వైద్యశాలకు బాధితురాలు మౌనిక
eenadu telugu news
Published : 24/07/2021 02:23 IST

వైద్యశాలకు బాధితురాలు మౌనిక

మౌనికను పరామర్శిస్తున్న జడ్పీటీసీ మాజీ సభ్యుడు అంజి, ఎస్సై సురేష్‌

ములకలపల్లి, న్యూస్‌టుడే: కాలు విరిగిందని భర్త, అత్తలు ఇంటిలోంచి ఓ మహిళను గెంటేసిన వైనంపై శుక్రవారం పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన సూచనతో జడ్పీటీసీ మాజీ సభ్యుడు బత్తుల అంజి, సర్పంచి భద్రం, తెరాస శ్రేణులతో కలసి భగత్‌సింగ్‌ నగర్‌కు వెళ్లి మౌనికను పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మౌనిక వైద్యానికి మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి చేయూత ఇస్తారని తెలిపారు. చరవాణిలో భర్త మహేష్‌తో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు. ఘటనపై స్పందించిన స్థానిక ఎస్సై సురేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎస్సై సురేష్‌ మౌనిక కుటుంబ సభ్యులకు రూ. 5వేలు వితరణగా అందించారు. ప్రత్యేక వాహనంలో బాధితురాలిని ఖమ్మంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఉప సర్పంచి అంజి, తెరాస మండల కార్యదర్శి రవి, నాయకులు నాగరాజు, మోట రవి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని