వ్యాధి బాధితులకు ఉచితంగా మందులు
eenadu telugu news
Published : 24/07/2021 02:23 IST

వ్యాధి బాధితులకు ఉచితంగా మందులు


మందుల్ని పరిశీలిస్తున్న రాష్ట్ర అధికారి డాక్టర్‌ నందిత తదితరులు

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: హెపటైటిస్‌ బీ, సీ లక్షణాలున్న వారికి ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ నందిత పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నేషనల్‌ హెపటైటిస్‌ వైరల్‌ స్క్రీనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన వైరల్‌ లోడు పరీక్షల శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. హెపటైటిస్‌ బీ, సీ లక్షణాలను వివరించారు. బాధితులు తమ కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయించి నిర్ధారించుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో కూడా శిబిరాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వైరస్‌ను సకాలంలో చికిత్స తీసుకుంటే సరిపోతుందన్నారు. వైద్యనిపుణులు డాక్టర్‌ నాగేశ్వరరావు అవగాహన కల్పించారు. శిబిరానికి హాజరైన వారి నుంచి ల్యాబ్‌ టెక్నీషియన్లు నమూనాలు సేకరించారు. ఎన్‌హెచ్‌ఎం డీపీవో నీలోహన, పాథాలజిస్ట్‌ సందీప్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని