సురక్షిత ప్రాంతాలకు గర్భిణుల తరలింపు
eenadu telugu news
Published : 24/07/2021 02:23 IST

సురక్షిత ప్రాంతాలకు గర్భిణుల తరలింపు


వాగు దాటుతున్న వైద్యాధికారిణి మౌనిక, సిబ్బంది

చర్ల, న్యూస్‌టుడే: వరదల నేపథ్యంలో మన్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కలెక్టర్‌ ఆదేశాలతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు ఆయా గ్రామాల్లో 20 రోజుల్లో ప్రసవాలు జరిగే గర్భిణులను ముందస్తుగా గుర్తించి తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. సత్యనారాయణపురం పీహెచ్‌సీ పరిధిలోని కిష్టారంపాడు నుంచి వైద్యాధికారి మౌనిక నేతృత్వంలో వైద్య బృందం అతికష్టం మీద వాగుదాటి ఆ గ్రామం చేరుకొంది. గ్రామంలో ఉన్న ఓ గర్భిణిని తరలించారు. కలివేరు, మామిడిగూడెం నుంచి 8 మంది గర్భిణులను ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని