సింగరేణి మాజీ డైరెక్టర్‌ బాలకృష్ణమూర్తి మృతి
eenadu telugu news
Published : 24/07/2021 02:23 IST

సింగరేణి మాజీ డైరెక్టర్‌ బాలకృష్ణమూర్తి మృతి

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణి మాజీ డైరెక్టర్‌ నందమూరి బాలకృష్ణమూర్తి (83) శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మృతిచెందారు. మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం సింగరేణి ఏరియాల్లో జనరల్‌ మేనేజర్‌గా, టెక్నికల్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన 1998లో ఉద్యోగ విరమణ చేశారు. స్వగ్రామం కృష్ణా జిల్లా బావులపాడు మండలం రంగన్నగూడెం. 1959లో బెనారస్‌ విశ్వవిద్యాలయం నుంచి మైనింగ్‌ ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత సింగరేణిలో చేరి ఉన్నత స్థానానికి ఎదిగారు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అధికారులు, ఉద్యోగులు బాలకృష్ణమూర్తి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌, జీఎంలు ఆనందరావు, బసవయ్య, వెంకటేశ్వరరెడ్డి, వెంకటరమణ మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని