నకిలీవి విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు: ఎస్పీ
logo
Published : 12/06/2021 06:18 IST

నకిలీవి విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు: ఎస్పీ

కొత్తగూడెం రామవరం, న్యూస్‌టుడే: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఉంటే సమాచారాన్ని పోలీసులకు అందించాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ కోరారు. జిల్లాలోని పోలీసు అధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన వారు, సమాచారం తెలిసిన వారెవరైనా వివరాలను 89780 72286 నంబరుకు ఫోన్‌ ద్వారా లేదా వాట్సాప్‌లో అందించాలని ఎస్పీ సూచించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, మార్కెటింగ్‌ చేస్తున్న, విక్రయాలను సాగిస్తున్న వ్యక్తులపై స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్సు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఠాల గుట్టురట్టు చేసేందుకు జిల్లావ్యాప్తంగా అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిల్లోనూ టాస్క్‌ఫోర్సు బృందాలను నియమించామన్నారు. నిందితులపై క్రిమినల్‌ కేసులను నమోదు చేయాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని