రూ.27 లక్షల మిరప విత్తనాలు స్వాధీనం
logo
Published : 12/06/2021 06:18 IST

రూ.27 లక్షల మిరప విత్తనాలు స్వాధీనం

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ రోహిత్‌రాజ్‌

సుజాతనగర్‌, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని శ్రీనివాస ట్రేడర్స్‌లో అనుమతులు లేని మిరప విత్తనాలను జిల్లా టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయ శాఖాధికారులు దాడులు నిర్వహించి శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఠాణాలో ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనుమతుల్లేకుండా విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సుజాతనగర్‌లోని శ్రీనివాస ట్రేడర్స్‌ విత్తనాలు, ఎరువుల దుకాణంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. అనుమతులు లేని అయిదు రకాల మిరప విత్తనాల ప్యాకెట్లు 9,897 గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.27.18 లక్షలు ఉంటుందని ఏఎస్పీ వెల్లడించారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతపై అనుమానం ఉంటే స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించాలన్నారు. బిల్లులు భద్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ ఆదినారాయణ, కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్‌బాబు, సీఐ గురుస్వామి, సుజాతనగర్‌ ఎస్సై శ్రీనివాస్‌, ఏడీఎ కరుణశ్రీ, మండల వ్యవసాయాధికారి నర్మద, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని