రేపే సింగరేణీయులకు ‘మెగా వ్యాక్సినేషన్‌’
logo
Published : 12/06/2021 06:18 IST

రేపే సింగరేణీయులకు ‘మెగా వ్యాక్సినేషన్‌’

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: ఇప్పటి వరకు టీకాలు పొందని ఉద్యోగుల కోసం ఆదివారం అన్ని సింగరేణి ఏరియాల్లో మెగా శిబిరాల్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్లు ఎన్‌.బలరాం, ఎస్‌.చంద్రశేఖర్‌, సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం వారు వివిధ ఏరియాల జీఎంలతో దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి వ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులకు టీకాలు అందించాలని ఛైర్మన్‌ శ్రీధర్‌ ఆదేశించినట్లు గుర్తుచేశారు. సంస్థ పరిధిలోని పాఠశాలలు, సామాజిక భవనాలు, క్లబ్‌లను శిబిరాలకు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని