నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు
logo
Published : 12/06/2021 06:18 IST

నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు

కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రస్తుత విద్యా సంవత్సరంలో శాఖాపరమైన ఉత్తర్వులు, నిబంధనలను పాటించని పాఠశాలలపై చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ శుక్రవారం హెచ్చరించారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల గుర్తింపు పత్రాలు, ఫీజుల వివరాలను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలన్నారు. గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు ఓ ప్రకటనలో సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని