‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం’
logo
Published : 12/06/2021 06:18 IST

‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం’

తూర్పుగూడెంలో ప్రజలకు సూచనలు ఇస్తున్న అధికారి వెంకటేశ్వరరావు

టేకులపల్లి, న్యూస్‌టుడే: సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి పొంచి ఉన్న తరుణంలో ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా నివారణ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన ఈ మేరకు మండలంలోని తూర్పుగూడెం, పెగళ్లపాడులో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను తనిఖీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ప్రతి ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమలు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి నిర్వీర్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సబ్‌యూనిట్‌ అధికారి సోనాజి, హెచ్‌ఎస్‌ వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎంలు కళావతి, సైదమ్మ, మంగతాయారు, రమేశ్‌బాబు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని