పెట్రో ధరల పెంపు దారుణం: భట్టి
logo
Published : 12/06/2021 06:18 IST

పెట్రో ధరల పెంపు దారుణం: భట్టి

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ నాయకులు

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: కరోనాతో ప్రజలు ఓవైపు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ధరలను పెంచడం దారుణమని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. టీపీసీసీ పిలుపులో భాగంగా పెంచిన ధరలను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం నగరం వైరారోడ్డులోని ఓ పెట్రోల్‌ బంకు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపడమే లక్ష్యంగా పాలకులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పెట్రో ధరల భారం అన్ని వర్గాలపై పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా పన్నులు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన రెండు ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ హయాంలో పెట్రో ధరలను నియంత్రించామని గుర్తుచేశారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు ఎండీ జావీద్‌, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, లకావత్‌ సైదులు, మహ్మద్‌ రఫీ బేగం, మాజీ కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, ఎర్రం బాలగంగాధర్‌తిలక్‌, నాయకులు వీరభద్రం, శేఖర్‌గౌడ్‌, ఉదయ్‌కుమార్‌, వెంకటయ్య, నరేశ్‌, రామకృష్ణ, రాందాస్‌ నాయక్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని