జ్యేష్ఠ మాసోత్సవాలు
logo
Published : 12/06/2021 06:18 IST

జ్యేష్ఠ మాసోత్సవాలు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో నిర్వహించే ఉత్సవాలలో జ్యేష్ఠ అభిషేకం ప్రత్యేకమైనది. అన్ని రకాల కష్టాలు తొలగి భగవంతుడి కృపా వృష్టి కురవాలనే సంకల్పంతో ఈ వేడుకను నిర్వహించాలని ఆగమ శాస్త్రం బోధిస్తుంది. ఈ సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని రామాలయం అధికారులు మరో ప్రత్యేక పూజ చేయాలని నిర్ణయించారు. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనాను తగ్గించేందుకు ఆసక్తి ఉన్న వారంతా దైవ భక్తితో రామ నామాలను పఠించాలని ప్రకటించారు. రామాలయంలో 27 రోజుల పాటు ప్రత్యేక పూజలను నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. అన్ని ఆపదలను తొలగించేది శ్రీరాముడి నామం. ఈ నేపథ్యంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 9 వరకు సామూహికంగా అర్చకులు ఆపదుద్దారక స్తోత్రాన్ని పఠించనున్నారు. దీక్షగా దీన్ని స్వీకరించి ప్రతీ రోజు ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఆలయంలో వేద పారాయణాలు చేయనున్నారు. ఆసక్తిగల భక్తులు తమ ఇంటి వద్ద ఈ సమయంలో ఆపదుద్దారక స్తోత్రాన్ని పారాయణం చేయాలని ఈవో శివాజీ కోరారు.

భద్రాచలం రామాలయంలో శుక్రవారం జ్యేష్ఠ మాసోత్సవాలను నిరాడంబరంగా ఆరంభించారు. ఆలయం తలుపులు తీసిన తర్వాత అర్చకులు సుప్రభాత సేవ చేసి నామార్చన నిర్వహించారు. ఆరాధించి దర్బారు సేవ కొనసాగించారు. 13న పునర్వసును పురస్కరించుకుని అభిషేకం ఉంటుంది. 14న పుష్యమి సందర్భంగా పట్టాభిషేకం చేయనున్నారు. లాక్‌డౌన్‌కు మినహాయింపులు వచ్చినప్పటికీ దర్శనాలకు అవకాశం రాలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని