మురుగు సమస్యకు సత్వర పరిష్కారం: కలెక్టర్‌
logo
Published : 12/06/2021 06:18 IST

మురుగు సమస్యకు సత్వర పరిష్కారం: కలెక్టర్‌

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మురుగు నీటి ప్రవాహ సమస్యల్లేకుండా పరిష్కరించాలని, అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. డ్రైనేజీల ఆక్రమణలను వెంటనే తొలగించాలన్నారు. మున్సిపల్‌ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ‘పచ్చదనం-పరిశుభ్రత’, ‘మరుగుదొడ్ల వినియోగం’, ‘చెత్త తొలగింపు’ తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. మణుగూరులో నాలాపై అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని కమిషనర్‌ని ఆదేశించారు. వ్యాపార ప్రాంతాల్లో వ్యర్థాలను చెత్తకుండీల్లోనే వేసేలా చూడాలన్నారు. ఖాళీ స్థలాలను యజమానులే శుభ్రం చేసుకోవాలని, లేదంటే నోటీసులిచ్చి వారి ఖర్చులతోనే ఆ పని చేయించాలన్నారు. ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, కేటీపీఎస్‌, సింగరేణి సంస్థల్లో బహిరంగ డస్ట్‌బిన్‌లను తొలగించి ఇంటింటి వ్యర్థాల సేకరణ చేపట్టాలన్నారు. పాల్వంచ మున్సిపాలిటీలో ఇంటింటి వ్యర్థాల సేకరణ బాగుందని కలెక్టర్‌ అభినందించారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు కమిషనర్లు సంపత్‌కుమార్‌, శ్రీకాంత్‌, శ్రీనివాసరెడ్డి, డీఈలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని