‘హరితహారం’లో విరివిగా మొక్కలు నాటండి
logo
Published : 12/06/2021 06:02 IST

‘హరితహారం’లో విరివిగా మొక్కలు నాటండి

‘హరితహారం’లో మొక్కలు భారీగా నాటేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా కలెక్టర్‌ అనుదీప్‌ను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి కమిషనర్‌ రఘునందన్‌రావు, ‘హరితహారం’ సీఎం కార్యాలయ ఓఎసీ్డీ ప్రియాంక వర్గీస్‌, సీసీఎఫ్‌ శోభ తదితరులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఖాళీ ప్రభుత్వ స్థలాలను పచ్చని వనాలుగా మార్చాలని, రహదారుల వెంట మొక్కలు నాటాలని సందీప్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా ప్రణాళికను కలెక్టర్‌ అనుదీప్‌ వివరిస్తూ ఏడో విడత హరితహారంలో కోటి 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా దోమల సంతతి వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖాధికారి రంజిత్‌, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, డీపీఓ రమాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని