పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
logo
Published : 12/06/2021 06:02 IST

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం

పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కొవిడ్‌ ఆంక్షలను పాటిస్తూ పెద్దమ్మతల్లికి శుక్రవారం పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రవికుమార్‌ శర్మ, నరసింహమూర్తి, దుర్గాప్రసాద్‌, వేదపారాయణదారు పద్మనాభశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు. తొలుత అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, పంచ హారతి, నివేదన, నీరాజన మంత్రపుష్పం అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని