18 మంది సర్వే అధికారుల బదిలీ
logo
Published : 12/06/2021 06:02 IST

18 మంది సర్వే అధికారుల బదిలీ

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణి సర్వే విభాగంలో 18 మంది అధికారులను బదిలీ చేస్తూ జీఎం (పర్సనల్‌) కె.బసవయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు కొందరు ఉన్నారు. కార్పొరేట్‌ పరిధి సూపరింటెండెంట్‌ సర్వే అధికారి పంజాల ప్రభాకర్‌ రామగుండం-3 ఏరియాకు, కార్పొరేట్‌ ఎస్టేట్స్‌ విభాగంలో పనిచేసే సీహెచ్‌ శ్రీనివాసులు మణుగూరు, సత్తుపల్లి ఓసీలో విధులు నిర్వహిస్తున్న కుమారస్వామి కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ అయ్యారు. కొత్తగూడెం పీవీకే-5 గనిలో డీవైఎస్‌ఎస్‌వోగా పనిచేస్తున్న జనార్దన్‌రెడ్డి భూపాలపల్లికి బదిలీ అయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని