రుణ మంజూరులో మందగమనం
logo
Published : 12/06/2021 06:02 IST

రుణ మంజూరులో మందగమనం

మహిళా ఎస్‌హెచ్‌జీలపై కొవిడ్‌ ప్రభావం

- ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే

కొవిడ్‌ రెండో దశ అన్ని రంగాలను కుదేలు చేయగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ రెండింటి ప్రభావం స్వయంసహాయక మహిళా సంఘాలపై కూడా పడింది. మహిళలు కరోనా పరిస్థితుల్లో ఒక చోట చేరి సమావేశం నిర్వహించుకోలేకపోయారు. నిన్నటివరకు లాక్‌డౌన్‌ వల్ల బ్యాంకుల పనివేళలు తగ్గిపోవడంతో మహిళా సంఘాలకు రుణాల మంజూరు ప్రక్రియ నెమ్మదించింది. ఫలితంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఎస్‌హెచ్‌జీలకు రుణాల మంజూరులో తీవ్రజాప్యం చోటు చేసుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన మంజూరులోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్నా ఖమ్మం జిల్లా వెనుకబడిపోవడం గమనార్హం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 11.46%

జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 16,115 సంఘాలకు రూ.43,115.01లక్షలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో జూన్‌ నెల వరకు 2,669 సంఘాలకు రూ.8264.80లక్షల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కాగా, ఇప్పటివరకు 245 సంఘాలకు రూ.947 లక్షలను అందించి 11.46శాతం లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా రుణాల మంజూరులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 7వ స్థానంలో నిలవగా, ఖమ్మం జిల్లా 23వ స్థానంలో నిలిచింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని