దోమలపై సమరమే
logo
Published : 12/06/2021 06:02 IST

దోమలపై సమరమే

కొత్తగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే


పాల్వంచలో నూనె బంతులు వదులుతున్న పారిశుద్ధ్య కార్మికుడు

మ్మడి ఖమ్మం జిల్లాలో నేటికీ కరోనా వైరస్‌ కలవరం పూర్తిగా తొలగిపోలేదు. ఇంకోవైపు వానాకాలం ప్రారంభమైంది. మున్ముందు సీజనల్‌ వ్యాధుల ప్రమాదం పొంచిఉంది. అతిసారం, మలేరియా, టైఫాయిడ్‌, గన్యా, డెంగీ, విషజ్వరాలు ప్రబలే వీలుంది. పారిశుద్ధ్యం అధ్వానంగా మారినా, తాగునీరు కలుషితమైనా, నీరు నిల్వ ఉన్నా.. దోమలు, ఈగలు వ్యాప్తి చెంది రోగాలు విజృంభించే అవకాశాలున్నాయి. కొవిడ్‌కు ఇవి తోడయితే ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడే వీలుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి ఉండటంతో ముఖ్యంగా మశకాలను నియంత్రించేందుకు స్థానిక అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. గతేడాది మొదటి దశ సమయంలో ప్రజల్లో వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై మరింత అవగాహన పెరిగింది. దీంతో సీజనల్‌ జ్వరాల సంఖ్య చాలా వరకు తగ్గింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం రోజువారీ సాధారణ ఓపీలు, ఐపీలు (కరోనాయేతర కేసులు) పడిపోయాయి. ప్రజారోగ్యంపై ఇదే చైతన్యాన్ని కొనసాగించేందుకు పుర, వైద్యారోగ్య శాఖలు సంయుక్తంగా సిద్ధమవుతున్నాయి. జ్వరాల నివారణలో భాగంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి వాటిని, సంతతిని నివారించే ప్రణాళికలు రూపొందించారు.

పట్టణాల్లో చేపడుతున్న కార్యక్రమాలు

*● మురుగుకాల్వలో పూడిక, వ్యర్థాలను తొలగించడం, నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడం. గుంతల్లో మొరం పోయించడం.

* నీరు నిల్వ ఉన్నచోట్ల యాంటీ లార్వా ప్రక్రియ చేపట్టడం. పిచ్చిమొక్కలు, చెట్లు తొలగించడం.

*● భవన నిర్మాణ శిథిలాలను పట్టణాల బయటకు తరలించడం.

*● వంద శాతం ఇళ్లలో తడి, పొడి వ్యర్థాలను సేకరించడం.

*● దోమల సంతతి నివారణకు గుంతల్లో, కాలువల్లో నూనె బంతులు వదలడం.

*● కాల్వల్లో మందు పిచికారీ, రాత్రివేళ ఫాగింగ్‌ కొనసాగించడం.

*● వార్డుల వారీగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక కాలనీలను గుర్తించి ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళిక అమలు చేయడం.

*● పాఠశాలలు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, జన సంచార నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టడం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని