Published : 16/05/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష

దృశ్యమాధ్యమ సమావొేశంలో పాల్గొన్న కొత్తగూడెం ఏరియా అధికారులు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: కరోనా నియంత్రణకు వివిధ ఏరియాల యాజమాన్యాలు తీసుకొంటున్న చర్యలపై సింగరేణి డైరెక్టర్‌ (పా) ఎన్‌.బలరాం, డైరెక్టర్‌ (ఈ,ఎం) సత్యనారాయణ శనివారం దృశ్య మాధ్యమ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. సింగరేణి భవన్‌ నుంచి బలరాం హాజరవగా, ప్రధాన కార్యాలయం నుంచి డైరెక్టర్‌ సత్యనారాయణరావు ముఖ్య వైద్యాధికారి ఎం.శ్రీనివాస్‌, కొత్తగూడెం ఏరియా జీఎం నర్సింహారావు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఏరియాల్లో తీసుకొంటున్న చర్యలను అధికారులు డైరెక్టర్లకు వివరించారు. అనుమానిత లక్షణాలున్న వారికి ఎప్పటికప్పుడు నిర్ధారణ పరీక్షలు చేయడం, బాధితులకు వెంటనే చికిత్స ప్రారంభించడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టాలని డైరెక్టర్లు ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని