Published : 16/05/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గూడెం’ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటుకు ప్రతిపాదనలు

 

టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొత్తగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ జనరేటింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా వైద్యాధికారులను కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి ఆదేశించారు. అప్పటి వరకు అవసరమైన అదనపు ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ఆయన తన కార్యాలయం నుంచి జిల్లా వైద్యాధికారులు, రెవెన్యూ, పరిశ్రమల శాఖ, డీఆర్‌డీఓ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి ఆసుపత్రుల్లో రోజుకు 250 సిలిండర్ల ఆక్సిజన్‌ వినియోగిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని నిల్వలు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానాసుపత్రిలో ప్లాంటు ఏర్పాటుకు పరిశ్రమల శాఖ జీఎం, డీఆర్‌డీఓ, జడ్పీ సీఈఓ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలన్నారు. 108 వాహనాలు వెళ్లలేని గ్రామాలకు ప్రత్యామ్నాయంగా మోటారు వాహనాలపై రోగులను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ ఆశా, ఆరోగ్య కార్యకర్త వద్ద పల్స్‌ ఆక్సీమీటరు, థర్మల్‌ స్కానర్‌ అందుబాటులో ఉండాలన్నారు. అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, అనుదీప్‌, అటవీ అధికారి రంజిత్‌, జిల్లా వైద్యాధికారి శిరీష, డీసీహెచ్‌ఎస్‌ డా.ముక్కంటేశ్వరరావు, జడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, ఔషధ నియంత్రణ అధికారి బాలకృష్ణ, ఆర్టీవో వేణు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఎమ్మార్పీ ధర కన్నా అధిక రేటుకు విక్రయిస్తే వెంటనే జిల్లా వైద్యాధికారులు శిరీష (99485 30088), ముక్కంటేశ్వరరావు (9700931010), ఔషధ నియంత్రణ అధికారి బాలకృష్ణ (9849634754)కు గానీ, కలెక్టరేట్‌, డీహెచ్‌ఎంవో కార్యాలయాల సహాయ కేంద్రాలకు గానీ సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని