Published : 16/05/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిట్టలవారిగూడెం తోటలో భారీగా పేలుడు పదార్థాలు

అక్రమంగా నిల్వలు

రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు


పట్టుబడిన పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్న సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: అక్రమంగా నిల్వ చేసి, రవాణా చేస్తున్న రూ.15.60లక్షల విలువైన పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ తెలిపారు. ఖమ్మం గ్రామీణ ఠాణాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. మండలంలోని వరంగల్‌క్రాస్‌రోడ్డులో పేలుడు పదార్థాలు తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్‌ఐ రవూఫ్‌ తన సిబ్బందితో వెళ్లి తనిఖీ చేపట్టారు. పేలుడు పదార్థాల బ్యాగులను ఆటోలోంచి కారులోకి ఎక్కిస్తుండగా పట్టుకున్నారు. ఇదే మండలంలోని తెల్దారుపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ మాలప్రోలు ఉపేందర్‌, కారులో ఉన్న నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం భీఫమునిపల్లికి చెందిన నామిరెడ్డి పూర్ణచందర్‌, మచ్చా రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మండలంలో గూడూరుపాడు శివారు పిట్టలవారిగూడెంలోని ఓ మామిడి తోటలో అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను సీజ్‌చేశారు. వీటిలో 35బ్యాగుల సల్ఫర్‌, 12 బ్యాగుల బ్లాక్‌ పౌడర్‌, 15బ్యాగుల మిక్స్‌డ్‌ గన్‌పౌడర్‌, 30 బ్యాగుల బూస్టర్స్‌, 5బాక్స్‌ల జిలెటిన్‌ స్టిక్స్‌, 950 డిటోనేటర్స్‌, డిటోనేటర్‌ ఫ్యూజ్‌ బాక్స్‌ 1,500 మీటర్లు, ఎక్స్‌లెడ్‌ 12బౌండరీలు(8మీటర్లు), 20బౌండరీలు(4మీటర్లు) మొత్తం వాటి విలువ రూ.15.60లక్షలు ఉంటుందని తెలిపారు. అక్కడే ఉన్న తెల్దారుపల్లికి చెందిన బోడపట్ల సుదర్శన్‌, చింతకాని మండలం కొదుమూరుకు చెందిన నక్కబోయిన శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలకు సంబంధించిన యజమానులు తెల్దారుపల్లికి చెందిన బోడపట్ల రాజేందర్‌, ఐతగాని శ్రీనివాస్‌ పరారీలో ఉన్నట్లు వివరించారు. భారీఎత్తున పేలుడు పదార్థాలను సీజ్‌ చేసి, వారి వద్ద ఉన్న రూ.45,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన అయిదుగురిని అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న యజమానులు రాజేందర్‌, ఐతగాని శ్రీనును త్వరలోనే అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఏసీపీలు వెంకటరెడ్డి, రామాంజనేయులు, సీఐ సత్యనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని