Published : 16/05/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవజాత శిశువుకు అరుదైన శస్త్రచికిత్స

భద్రాచలం వైద్యులే స్ఫూర్తి


వెంటిలేటర్‌పై శిశువు

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: కరోనా సమయంలో కాన్ఫు. అందునా క్లిష్ట పరిస్థితుల్లో మలద్వారం లేని ఆ బిడ్డకు ఆపరేషన్‌ చేసి సరిచేశారు. ఆ బిడ్డను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యుల స్ఫూర్తిని పలువురు కొనియాడుతున్నారు. విచిత్రమేంటంటే ఆ బిడ్డను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు. వారి ఆచూకీ కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రయత్నిస్తున్నారు... వివరాల్లోకి వెళితే...

అశ్వారావుపేట మండలం చెన్నాపురం అటవీప్రాంత సమీపంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ మకాం జిల్లేడుబాకలో కాశ్యప్‌ జాంబతి నిండు గర్భిణీ. ఆమె భర్త బిజో. ఈ నెల 12న గుమ్మడవల్లి పీహెచ్‌సీకి 108లో ప్రసవానికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యాధికారి హరీశ్‌, వైద్య సిబ్బంది ఆమెకు కాన్పు చేయగా మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ మలద్వారం లేకుండా పుట్టడంతో అదే రోజు సాయంత్రం ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి 108లో తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆ బిడ్డకు డాక్టర్‌ ముదిగొండ రామకృష్ణ, చిన్నపిల్లల వైద్యుడు సుమన్‌, మత్తు వైద్యుడు తాటి మల్లేశ్‌, డాక్టర్‌ కైలాష్‌మోహన్‌ శనివారం శస్త్రచికిత్స చేసి మలద్వారం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శిశువు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. అయితే ఆసుపత్రిలో ఆ బిడ్డను వదిలేసిన తల్లిదండ్రులు ఎటు వెళ్లారో తెలియలేదు. శనివారం ఉదయం నుంచి తల్లిదండ్రులు కనిపించకపోయినా మానవతా దృక్పథంతో భద్రాచలం ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బిడ్డ తల్లిదండ్రుల చరవాణి నంబరూ లేకపోవడంతో వారి చిరునామా తెలుసుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో వైద్యుల తల్లిదండ్రులు ఆచూకీ కోసం భద్రాచలంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్వారావుపేట ఆసుపత్రి అధికారులకు సైతం సమాచారం ఇచ్చారు. కొవిడ్‌ కేంద్రంలో మలద్వార శస్త్రచికిత్స చేసి బిడ్డ ప్రాణాలను కాపాడిన వైద్యుల కృషిని పలువురు అభినందిస్తున్నారు.


చిన్నారికి మలద్వార ఆపరేషన్‌ చేసిన వైద్యబృందం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని