Published : 16/05/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చదువులమ్మ చేతి చలువ

ఆహారాన్ని ప్యాకింగ్‌ చేస్తున్న జ్యోతిర్మయి

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: మణుగూరు మండలం అశోక్‌నగర్‌కు చెందిన జ్యోతిర్మయి, ఈమె భర్త శివ ప్రభుత్వ ఉపాధ్యాయులు. జ్యోతిర్మయి అశ్వాపురం మండలం మిట్టగూడెంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొవిడ్‌ సోకిన వారికి అండగా ఉండేందుకు బాధిత కుటుంబాల్ని దత్తత తీసుకొని రెండు పూటలా ఆహారం అందిస్తున్నారు. ఈమె స్వయంగా ఆహారాన్ని వండి వాటిని ప్యాక్‌ చేసి కొవిడ్‌ కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు. ఆహారం పంపిణీ విషయంలో జగన్‌ అనే యువకుడి సాయం తీసుకుని ఈమె ముందుకు వెళ్తున్నారు. ఓ కుటుంబంలో భార్య, భర్తకు కొవిడ్‌ సోకితే ఆ కుటుంబం ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు భోజనం పంపిణీ చేస్తున్నారు.

బాధిత కుటుంబాల దత్తత

రోజువారి కూలి పనులకు, వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కరోనా బారినపడితే వారికి కూడా ఈమె రూ.5వేలతో నెలకు సరిపడా నిత్యావసరాలను అందజేస్తున్నారు. మరో అయిదు ఇతర కుటుంబాలకు వీటిని ఇచ్చారు. ఈమె గత పది రోజుల నుంచి 10కుటుంబాలను దత్తత తీసుకున్నారు. పప్పు, రసం, కూర, ఫ్రై, గుడ్లు, పండ్లు, అన్నంతో కూడిన పౌష్టికాహారాన్ని రెండు పూటలా అందజేస్తున్నారు.

తిండికి ఎవరూ ఇబ్బందులు పడొద్దు: జ్యోతిర్మయి

మా బాబుతోపాటు 17రోజులు నేనూ క్వారంటైన్‌లో ఉన్నా. ఆ సమయంలో నా భర్త సాయం చేశారు. నా భర్తకు కూడా కరోనా సోకితో మా పరిస్థితి ఏంటి అని ఆలోచన వచ్చింది. ఇలా కుటుంబంలోని దంపతులకు మహమ్మారి సోకి చాలామంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలుసుకున్నా. వారికి నేను ఏదో ఒక సాయం చేయాలని ఈ విధంగా ముందుకు వచ్ఛా నేను చేస్తున్న సేవా కార్యక్రమాన్ని కొంతమంది గుర్తించి వారూ నగదు రూపేనా సాయపడేందుకు ముందుకు రావటం అభినందనీయం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని