Published : 16/05/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముగ్గురు మావోయిస్టుల అరెస్టు

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా ఎర్రబోరు, దోర్నపాల్‌ పోలీస్‌స్టేషన్‌లలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎర్రబోరు అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ 219 బెటాలియన్‌ భద్రతా బలగాలు కూంబింగ్‌ చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో ఇద్దరు మావోయిస్టులు జవాన్‌లను చూసి పారిపోతుండగా వెంటాడి పట్టుకున్నారు. వీరిద్దరూ మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తూ పలు విధ్వంసకర, హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్లు తెలిసింది. అనంతరం వీరిద్దరినీ అరెస్టు చేశారు.

* దోర్నపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టెట్రాయి అటవీ ప్రాంతంలో పోలీస్‌ భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఓ మావోయిస్టు కంటపడడంతో పట్టుకొని విచారించారు. ఇతడిని వెంటనే అరెస్టు చేశారు. ఇతనిపై ప్రభుత్వం సుమారు రూ.లక్ష రివార్డు ప్రకటించింది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలను సుకుమా జిల్లా ఎస్పీ కన్హయ్‌లాల్‌ ధృవ్‌ నిర్ధారించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని