Published : 21/04/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేటి నుంచి థియేటర్లు బంద్‌

వకీల్‌సాబ్‌కు మాత్రం అనుమతి

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: నేటి నుంచి సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాష్ట్ర థియేటర్‌ యజమానుల అసోసియేషన్‌, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా థియేటర్ల మూసివేతకు ఏకగ్రీవ నిర్ణయం ఖరారైంది. కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యజమానులు తెలిపారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో సినిమాల ప్రదర్శనలను నిలిపివేసేందుకు నిర్ణయించారు. ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ చలనచిత్రం ప్రదర్శనలు మాత్రం కొనసాగనున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రాకుండా థియేటర్లను నడపనున్నారు. ఉమ్మడి జిల్లాలో 42 థియేటర్లు ఉండగా.. వకీల్‌సాబ్‌ సినిమా సుమారు 10 థియేటర్లలో ప్రదర్శితమవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని