Published : 21/04/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మల్లన్నసాగర్‌ కాలువలో మునిగి..

వైరా యువకుడి మృతి

కొండపాక, న్యూస్‌టుడే: మల్లన్నసాగర్‌ కాలువలో స్నానం కోసం దిగిన వైరా మండల వాసి నీట మునిగి మృత్యువాతపడ్డాడు. మండలంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన వల్లభనేని అశోక్‌(32) అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ చల్లగుండ్ల రాజేశ్‌తో కలసి మొక్కజొన్నల లోడ్‌తో సిద్ధిపేట జిల్లా కొడకండ్లలోని ప్రసాద్‌ సీడ్స్‌ కంపెనీకి మంగళవారం చేరుకున్నాడు. కొద్దిసేపటికి శివారులోని మల్లన్నసాగర్‌ కాలువలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో రాజేశ్‌ కాలువ గట్టు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు మాత్రమే ఒడ్డుపై కనిపించాయి. దీంతో కుకునూరుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. సాయంత్రం కాలువలో అశోక్‌ మృతదేహం లభించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని