close

సోమవారం, మే 25, 2020

తాజా వార్తలు

పోస్టుమార్టం చేయించకుండా మృతదేహం ఖననం

మళ్లీ వెలికితీసి శవపరీక్ష చేసిన అధికారులు


బాలుడి మృతదేహాన్ని వెలికి తీయించిన పోలీసులు

జూలూరుపాడు, కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ఖననం చేసిన బాలుడి మృతదేహాన్ని వెలికితీయించి శవపరీక్ష నిర్వహించిన సంఘటన జూలూరుపాడు మండలం భోజ్యాతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుగులోత్‌ శివ(13) పాదరక్షల విషయంలో తన సోదరుడితో గురువారం గొడవ పెట్టుకున్నాడు. మనస్తాపానికి గురైన అతడు పురుగుమందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుణ్ని కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతడు కొద్దిసేపటి తర్వాత మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతుడి కుటుంబీకులు ఆసుపత్రిలో ఓ చిరుద్యోగి సాయంతో మృతదేహాన్ని భోజ్యాతండా తరలించి రాత్రికి రాత్రే ఖననం చేశారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందగా, పాపకొల్లు వీఆర్వో ఇ.రవీంద్ర కూడా ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్‌, సిబ్బందితో కలిసి శుక్రవారం గ్రామానికి వెళ్లి ఖననం చేసిన బాలుడి మృతదేహాన్ని వెలికితీయించారు. తహసీల్దార్‌ కె.విజయ్‌కుమార్‌ సమక్షంలో పంచనామా, శవపరీక్ష జరిపించారు. ఈ సంఘటనపై కేసు నమోదైంది. ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇవ్వకుండా శివ మృతదేహాన్ని తరలించిన విషయమై శుక్రవారం కొత్తగూడెం మూడో పట్టణ పోలీసులు దవాఖానాలో విచారణ జరిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.రమేశ్‌ను ఈ సంఘటనపై వివరణ కోరగా.. ‘మృతుడి తల్లిదండ్రుల బాధను చూడలేక మానవతా దృక్పథంతో వ్యవహరించినట్లు ఆసుపత్రి ఉద్యోగి చెబుతున్నారు. అయినా అది తప్ఫు విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామ’న్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.