గుప్తనిధుల వేట : నలుగురి పట్టివేత
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

గుప్తనిధుల వేట : నలుగురి పట్టివేత

యైటింక్లయిన్‌కాలనీ: గుప్త నిధుల వేటకు వచ్చిన నలుగురు వ్యక్తులు రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు దొరికిన వైనం ముస్త్యాల గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముస్త్యాల గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును అనుసరించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, పొంతన లేని సమాధానం చెప్పారు. వారు ప్రయాణిస్తున్న కారులో మెటల్‌ డిటెక్టర్‌, ఇతర ఎలక్ట్రికల్‌ డివైజ్‌లు లభించాయి. సాన తిరుపతి(మంచిర్యాల), పానగంటి హరీష్‌(ఆసిఫాబాద్‌), ఈట కృష్ణ(బెల్లంపల్లి), గొర్లవల్లి అశోక్‌(కాసిపేట)లను అదుపులోకి తీసుకొని విచారించగా పురాతన ప్రాంతాల్లో గుప్త నిధుల వేటకు వచ్చినట్లు పేర్కొన్నారు. నలుగురు నిందితులను గోదావరిఖని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని