సెల్‌టవర్‌ ఎక్కి నిరసన
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

సెల్‌టవర్‌ ఎక్కి నిరసన


సెల్‌ టవర్‌పై స్వామి

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: తన ఇంటికి వెళ్లే రహదారికి అడ్డంగా బండరాళ్లు పెట్టి మూసేశారంటూ మండలంలోని మ్యాడారం తండాకు చెందిన ఆజ్మీర స్వామి సారంగాపూర్‌కు వచ్చి సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. 30 ఏళ్లుగా రహదారి ఉండగా సదరు వ్యక్తి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని, పంచాయితీలు జరిగినా తగిన న్యాయం జరగడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు గంటకు పైగా సెల్‌టవర్‌పైనే కూర్చోని న్యాయం జరిగే వరకు కిందికి దిగనంటూ అక్కడే ఉండిపోయాడు. జడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డితోపాటు బంధువులు, గ్రామస్థులు నచ్చజెప్పినప్పటికీ కిందికి దిగిరాలేదు. చివరికి సమస్య ఉంటే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటయ్య, కానిస్టేబుల్‌ హరికిషన్‌ స్వామికి నచ్చచెప్పారు. ఎట్టకేలకు కిందికి దిగడంతో పోలీసులతోపాటు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బండరాళ్లు అడ్డుపెట్టిన వ్యక్తి కూడా రహదారి కొనసాగిస్తే పురుగు మందు తాగి చనిపోతానంటూ బెదిరించినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని