దొంగల హల్‌చల్‌
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

దొంగల హల్‌చల్‌

 జిల్లాలో 20 విద్యుత్తు నియంత్రికల ధ్వంసం

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే


సంగెం గ్రామంలో విద్యుత్తు నియంత్రికను ధ్వంసం చేసిన దుండగులు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దొంగలు విద్యుత్తు నియంత్రికలను ధ్వంసం చేసి అందులో ఆయిల్‌, రాగి తీగలను ఎత్తుకెళ్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్యకాలంలో జిల్లాలోని వివిధ మండలాల్లో 20 నియంత్రికలను ధ్వంసం చేసి నష్టం కలిగించారు. వ్యవసాయానికి విద్యుత్తు అంతరాయం ఏర్పడి తీవ్ర ఇబ్బంది పడుతుండగా విద్యుత్తుశాఖకు దాదాపు రూ.10 లక్షల మేరా నష్టం వాటిల్లింది. జగిత్యాల ఎస్‌ఈ వేణుమాధవ్‌ జరుగుతున్న నష్టంపై జిల్లా ఎస్పీ సింధూశర్మకు బుధవారం ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ధర్మపురి, వెనుగుమట్ల, గౌరాపూర్‌, అయిలాపూర్‌, కల్లూర్‌, చౌలమద్ది, ఆరపేట, ధర్మారం, మెట్‌పల్లి, వెంకట్రావ్‌పేట, వెల్లుల్ల, సంగెం గ్రామాల్లోని 13 నియంత్రికలను పగులగొట్టి అందులోని రాగి తీగలను ఎత్తుకెళ్లారు. ఒక్కో నియంత్రికలో 35 నుంచి 40 కిలోల రాగి తీగలు లభిస్తుండటంతో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారు. వీటితోపాటు పూడురు, తాటిపల్లి, నమిలికొండ, పూడూరు, రాజేశ్వర్‌పేట గ్రామాల్లో 7 నియంత్రికల కింది భాగం నుంచి ఆయిల్‌ను ఎత్తుకెళ్లారు. ఈ అయిల్‌ను వెల్డింగ్‌ మిషన్‌కు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని