రాజన్న హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

రాజన్న హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు


డబ్బులు లెక్కిస్తున్న ఆలయ అధికారులు, సిబ్బంది

వేములవాడ ఆలయం, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి హుండీని బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. 15 రోజుల హుండీ ఆదాయం రూ.1,71,92,570 వచ్చినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. బంగారం 626 గ్రాముల 450 మిల్లీ గ్రాములు, వెండి 17 కిలోల 500 గ్రాములను భక్తులు కానుకలుగా సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

కొనసాగిన భక్తుల రద్దీ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు కుటుంబ సమేతంగా కోడె మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేశారు. దాదాపు పది వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. బద్దిపోచమ్మ, భీమేశ్వరస్వామి ఆలయాల్లోనూ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని