రూ.2.90 లక్షలు పట్టివేత
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

రూ.2.90 లక్షలు పట్టివేత

చొప్పదండి, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో మర్లవాడ సమీపంలో పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. పట్టణంలోని మర్లవాడ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా పత్తిపాకకు చెందిన ఎదుల్ల మల్లేశ్‌ కారులో రూ.2.90లక్షలు ఎలాంటి రసీదులు లేకుండా తరలిస్తుండటంతో పట్టుకున్నట్లు వివరించారు. విచారణ చేపట్టి తహసీల్దార్‌ రజిత ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. అనంతరం డబ్బులను జప్తు చేసి కరీంనగర్‌ ఎస్టీవోకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

మద్యం...

కరీంనగర్‌ నేరవార్తలు : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రూ.8 వేల విలువగల 10.44 లీటర్ల మద్యం పట్టుకున్నారు. మూడు కేసుల్లో ఏడుగురిని స్థానిక తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు కమిషనరేట్‌ కార్యాలయం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని