గెలుపోటములపై రచ్చబండల వద్ద చర్చ
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

గెలుపోటములపై రచ్చబండల వద్ద చర్చ

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలు తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, వారికి మద్దతుగా ప్రచార తారలు పాల్గొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏ గ్రామంలో చూసినా ఎన్నికలపై చర్చనే సాగుతోంది. గ్రామాల్లో రచ్చబండ వద్ద నలుగురు గుమిగూడారంటే చాలు ఈటల గెలుస్తారా.. గెల్లు శ్రీను గెలుస్తారా...కాంగ్రెస్‌ అభ్యర్ధి వెంకట్‌ గెలుస్తారా అన్న అంశమే చర్చ సాగుతోంది. మద్యం, డబ్బు పంపిణీ విషయం గురించి గ్రామాల్లో మరికొందరు చర్చించుకోవడం కనిపించింది. ఎవరికి ఓటు వేస్తే తమ గ్రామానికి ప్రయోజనం చేకూరుతుందని కూడా విశ్లేషించుకుంటున్నారు.

-ఈటీవీ, కరీంనగర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని