కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం

ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

జమ్మికుంటలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని ఆబాది జమ్మికుంట, ధర్మారం, రామన్నపల్లి, మోత్కులగూడెంలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. సాయంత్రం మోత్కులగూడెం చౌరస్తాలో ప్రముఖ కళాకారుడు సాయిచంద్‌ ఆధ్వర్యంలో ధూం..ధాం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. భాజపా నాయకులు మాత్రం ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఏడేళ్ల పాలనలో ఏ ప్రాంతాన్ని, ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని సాకారం చేస్తున్నట్లు చెప్పారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుపేదలకు రెండుపడక గదుల ఇళ్లను కట్టించి ఇచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు నన్నేపునేని నరేందర్‌, కోరుకంటి చందర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, తెరాస పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని