తెరాస దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

తెరాస దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ప్రచారంలో మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్‌

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ఉప ఎన్నికలో భాజపా గెలిస్తే పింఛన్లు పోతాయని, కరెంట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగిస్తారని తెరాస నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జమ్మికుంట మండలం అంకుషాపూర్‌, మడిపల్లి, మాచనపల్లి, సైదాబాద్‌, విలాసాగర్‌, గండ్రపల్లి, శాయంపేట గ్రామాలలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో బండి సంజయ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలు వంచి పేదల కోసం పోరాడే పార్టీ భాజపా మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, ఈటల జమున, సంపెల్లి సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని