కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి ప్రజావ్యతిరేక విధానాలు
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి ప్రజావ్యతిరేక విధానాలు


వావిలాలలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న భట్టి విక్రమార్క, చిత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి కాకుండా భాజపా, తెరాసకు ఓటు వేస్తే దోపిడీని ప్రోత్సహించినట్లేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ జమ్మికుంట మండలం వావిలాల, నగురం, నాగారం, పాపక్కపల్లి, శంబునిపల్లి, తనుగుల, గండ్రపల్లి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఆస్తులను కాపాడుకోవడానికే భాజపాలో చేరాడని ఆరోపించారు. తెరాస నాయకులు అక్రమంగా సంపాదించిన సొమ్మును ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయన్నారు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తున్న భాజపాకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించని తెరాసకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ దళిత బంధు ప్రజలను మోసం చేయడానికే తెచ్చిన పథకమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు విజయరామారావు, సాయిని రవి, జగదీశ్వర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని