పారదర్శకంగా భూ సేకరణ సర్వే
eenadu telugu news
Published : 17/09/2021 02:13 IST

పారదర్శకంగా భూ సేకరణ సర్వే

అధికారులకు సూచనలిస్తున్న ఆర్డీవో శంకర్‌కుమార్‌

ధర్మారం, న్యూస్‌టుడే: ధర్మారం మండలం ఖానంపల్లిలో భీమన్న చెరువు నిర్మాణం కోసం సేకరించనున్న భూముల సర్వేను పారదర్శకంగా చేపడుతున్నట్లు పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న చెరువు సామర్థ్యాన్ని పెంచేందుకు భూ సేకరణకు ప్రభుత్వం మొదటి విడతగా రూ.2.12 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రైతుల వారీగా సేకరించనున్న సర్వేను గురువారం ప్రారంభించగా ఆర్డీవో పర్యవేక్షించారు. ఏఎంసీ ఛైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, నీటిపారుదల శాఖ డీఈఈ రూపానాయక్‌, సర్వే డివిజనల్‌ ఇన్స్‌పెక్టర్‌ విజయశంకర్‌, ఆర్‌ఐ తిరుపతి, సర్వేయరు నరేష్‌, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని