‘నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత మాదే’
eenadu telugu news
Published : 17/09/2021 02:13 IST

‘నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత మాదే’

అమరులకు నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి

గోదావరిఖని, న్యూస్‌టుడే : తెలంగాణాలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులకే ఉందన్నారు. దీనిపై మతోన్మాద భాజపా నాయకులు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన బస్సుయాత్ర గురువారం మధ్యాహ్నం గోదావరిఖనికి చేరుకుంది. నగరపాలక కార్యాలయం నుంచి ద్విచక్రవాహనాలతో స్వాగతం పలికిన స్థానిక నాయకులు చౌరస్తాలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వెంకటరెడ్డి మాట్లాడారు. భాజపా నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిజాం వారసుడిగా కేసీఆర్‌ కొనసాగుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మాట్లాడిన సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించారన్నారు. సీపీఐ నగర శాఖ అధ్యక్షుడు కె.కనకరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు శంకర్‌, వై.గట్టయ్య, అనిల్‌కుమార్‌, నరసింహ, శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, శ్రీమాన్‌, గోవర్దన్‌, మోహన్‌ తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని