డబ్బు లేదు... ప్రజాబలం ఉంది
eenadu telugu news
Published : 17/09/2021 02:13 IST

డబ్బు లేదు... ప్రజాబలం ఉంది

భాజపాలో చేరిన వారితో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: తనను ఉప ఎన్నికలో ఓడించాలని ఇప్పటికే రూ.200కోట్లు పంచి పెట్టారు. వారి లాగా తన దగ్గర వందల కోట్లు లేవని, కానీ ప్రజాబలం ఉందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. జమ్మికుంట పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పలువురు భాజపాలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ గుడులు, కురుమ, యాదవ, ముదిరాజ్‌ సంఘాల భవనాలు ఇస్తున్నారు. రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారు. అవన్నీ వారి సొంత డబ్బులు కావన్నారు. మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ మాట్లాడుతూ మహిళలను పట్టించుకొని తెరాస ప్రభుత్వం ఇప్పుడు మహిళ సంఘాలకు చెక్కులను ఇస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు సంపత్‌రావు, మల్లేశ్‌, యాదగిరి, రమేశ్‌, కుమారస్వామి, పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని