సహకార బ్యాంకులతో అన్నదాతకు మేలు
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

సహకార బ్యాంకులతో అన్నదాతకు మేలు

నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న రవీందర్‌రావు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

కోరుట్ల, న్యూస్‌టుడే : అన్నదాతలకు సహకార బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా విస్తృత సేవలందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. బుధవారం కోరుట్లలో రూ.60 లక్షలతో కెడీసీసీ బ్యాంకు, రూ.30 లక్షలతో సహకార సంఘ నూతన భవనం, గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. తెలంగాణ ఏర్పాటుకు ముందు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం 25 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాంలను నిర్మించామన్నారు. వ్యవసాయంను అభివృద్ధి పథంలో నడిపేందుకు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సౌకర్యార్థం కోరుట్లలో కేడీసీసీ బ్యాంకు, సహకార సంఘంకు సొంత భవనాలను నిర్మిస్తున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యంను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. డీసీఎంఎస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, కెడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, మేనేజర్‌ ప్రవీణ్‌, జిరైసస కన్వీనర్‌ చీటి వెంకట్రావ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అన్నం లావణ్య, వైస్‌ఛైర్మన్‌ గడ్డమీది పవన్‌, ఎంపీపీ తోట నారాయణ, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ఎలిశెట్టి భూంరెడ్డి, వైస్‌ఛైర్మన్‌ పాతర్ల సత్యం, పీఏసీఎస్‌ ఛైర్మన్‌లు, కౌన్సిలర్‌లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని