ఏడేళ్లలోనే అద్భుత ప్రగతి
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

ఏడేళ్లలోనే అద్భుత ప్రగతి

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే : ఏడేళ్లలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు పేర్కొన్నారు. నియోజకవర్గ పార్టీ కమిటీల ఎన్నికకు సంబంధించి నిర్వహించిన దిశానిర్దేశ కార్యక్రమంలో భాగంగా ఆయన జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వానికి మంచి స్పందన లభించిందన్నారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి 30 ఏళ్లలో చేయని అభివృద్ధి తెరాస 7 సంవత్సరాల్లో చేసిందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పండుగ వాతావరణంలో చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, గట్టు సతీష్‌, రాజేందర్‌రెడ్డి, కోల శ్రీనివాస్‌, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని