ప్రజలందరూ టీకా వేసుకునేలా అవగాహన
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

ప్రజలందరూ టీకా వేసుకునేలా అవగాహన

ఎర్దండిలో ప్రజలతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రవి

ఇబ్రపీీాంపట్నం, న్యూస్‌టుడే : మండలంలోని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, కొవిడ్‌ టీకాను ఇప్పటికి తీసుకోని వారిని గుర్తించి, వారికి టీకా గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. మండలంలోని గోధూర్‌, తిమ్మాపూర్‌, వేములకుర్తి, ఎర్దండి గ్రామాల్లో చేపట్టిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రత్యేక కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ రవి గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ టీకాలను తక్కువ తీసుకున్న గ్రామాల్లో మొదట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇంటింటి సర్వే నిర్వహించి, శతశాతం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, సిబ్బందికి భోజన సదుపాయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించాలని, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు టీకా కోసం వస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అదనపు సిబ్బందిని వినియోగించాలన్నారు. పది రోజుల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మెట్‌పల్లి ఆర్డీవో వినోద్‌ కుమార్‌, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, సర్పంచులు ప్రభాకర్‌, హేమలత, నవ్యశ్రీ, లక్షణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులందరికీ వ్యాక్సిన్‌

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొవిడ్‌ టీకా వేయాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లాలోని అధికారులతో జూమ్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 140, పట్టణ ప్రాంతాల్లో 134 టీకా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రతిరోజు ఒక్కో కేంద్రంలో వందమందికి జిల్లా వ్యాప్తంగా 27,400 మందికి తగ్గకుండా టీకాలు వేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి టీకా వేయాలని ఇంటింటికి సర్వే నిర్వహించి టీకా వేసినట్లు స్టిక్కర్లు అంటించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని