జిల్లాలో దారుణం
eenadu telugu news
Updated : 17/09/2021 02:04 IST

జిల్లాలో దారుణం

అయిదేళ్ల బాలికపై అత్యాచారం

పోలీసుల అదుపులో నిందితుడు

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సింధుశర్మ

జగిత్యాల, న్యూస్‌టుడే : ఆరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను రాష్ట్రం మరువక ముందే జగిత్యాల జిల్లాలో మరో అత్యాచార ఘటన దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఐదేళ్ల బాలికపై ఇంటర్మీడియట్‌ చదువుతున్న యువకుడు బుధవారం అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన సంచలనం సృష్టించింది. చిన్నారి తండ్రి వేరే గ్రామానికి వెళ్లడం, తల్లి బయటకు వెళ్లడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘోరాన్ని తండ్రి తెలుసుకున్నారు. గురువారం బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని సాయంత్రం 5.30 గంటలకు నేరెళ్ల సమీపంలోని సాంబశివుని గుట్ట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ప్రకాష్‌, ధర్మపురి సీఐ కోటేశ్వర్‌ ఆధ్వర్యంలో ఏఎస్సై రాజు, సిబ్బంది నర్సింగరావు, సతీష్‌లు నిందితుడిని పట్టుకున్నారని ఎస్పీ సింధుశర్మ చెప్పారు. నిందితుడు కరీంనగర్‌లోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. నేరసంఖ్య 371/2021, ఐపీసీ 448,346(ఎ)(బి), ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్‌ చేశామని చెప్పారు. మహిళా ఎస్సై నవత ద్వారా బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేయించి వీడియోగ్రఫీ తీయించామన్నారు. బాలికకు జగిత్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య పరీక్షల్ని చేయించి నమూనాలను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి పంపించామని నిందితుడిని కరీంనగర్‌ ఫోక్సో న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు ఎస్పీ చెప్పారు. బాధితురాలికి వైద్యపరీక్షలని నిర్వహించామని, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన నమూనాల ఫలితం ఆధారంగా వైద్యుల సూచన మేరకు త్వరలోనే ఛార్జిషీట్‌ వేస్తామన్నారు.

చుట్టపుచూపుగా వచ్ఛి..

ధర్మపురి : వీరి కుటుంబాలు పక్కపక్కనే ఉండటం, చుట్టరికంతోనే వచ్చి కాటేయడంతో ఎలాంటి అనుమానాలు లేకుండా ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారిని టీవీలో సినిమా చూపిస్తానంటూ తీసుకు వెళ్లడం, ఆపై ఇలా చేయడం పలువుర్ని కలిచివేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పిండి పట్టేందుకు గ్రైండర్‌ కోసం వచ్చిన ఓ మహిళ మూసి ఉన్న తలుపులు తోచుకుంటూ లోనికి వెళ్లడంతో విషయం బయటపడ్డట్లు భావిస్తున్నారు. నిందితుడి చరవాణిలో అశ్లీల చిత్రాలు చూసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని