ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధన
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధన

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి విద్యాధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో విద్యాశాఖ అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందుతున్న సేవల గురించి, భవిత కేంద్రాల్లో నిర్వహణ, కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులకు ఏ విధంగా విద్యాబోధన అందుతోందని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల ప్రగతిపై సమీక్షించారు. గత మూడు సంవత్సరాల పదో తరగతి ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ కేజీబీవీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆదర్శ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఐఐటీ, నీట్‌ లాంటి పరీక్షలలో విజయం సాధించే దిశగా వారికి శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాధికారికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి డి.రాధాకిషన్‌, డీఈ నరసింహారావు, సమగ్ర శిక్షా కోఆర్డినేటర్లు సూర్యనారాయణ, విద్యాసాగర్‌, పద్మజ, శైలజ, బాలచందర్‌, సోఫియా తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు 24 గంటలు సేవలు అందించాలి

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని 108, 102 అంబులెన్స్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. కలెక్టర్‌కు గురువారం 108, 102, 1962 పార్థివ వాహనాల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ భూమనాగేందర్‌ త్రైమాసిక నివేదికను అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పేదలు వేలాది మంది డబ్బులు ఖర్చుపెట్టుకోలేక అనారోగ్యాలతో ఉంటున్నారని వారికి అవగాహన కల్పిస్తూ ఈ వాహనాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని