జిల్లాలో అవసరమైనంత వ్యాక్సిన్‌
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

జిల్లాలో అవసరమైనంత వ్యాక్సిన్‌

టీకా కేంద్రాన్ని పరిశీలిస్తున్న జడ్పీ అధ్యక్షురాలు అరుణ

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రజలకు అవసరమైనంత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. పట్టణంలోని 7వ వార్డులో నిర్వహించిన కొవిడ్‌19 వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జిందం కళతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొవిడ్‌19 వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. టీకా తీసుకోని వారిని గుర్తించి ప్రతి ఒక్కరూ వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పండుగలు ఉన్నాయని, ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుందని, కరోనా నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భూక్యరెడ్డి నాయక్‌, ఆడెపు సౌజన్య, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, వైద్యురాలు నయింజహా తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని