మద్యం మత్తులో పురుగుల మందు తాగి..
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

మద్యం మత్తులో పురుగుల మందు తాగి..

చికిత్స పొందుతూ యువకుడి మృతి

పెద్దపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెద్దపల్లి ఎస్‌ఐ రాజేష్‌ కథనం ప్రకారం పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామానికి చెందిన పడాల శ్రీనివాస్‌(34) మద్యానికి బానిసయ్యాడు. కాగా ఆగస్టు 10న మద్యం తాగిన మత్తులో అతడు ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగాడు. కొద్ది రోజులకు అనారోగ్యానికి గురి కావడంతో హైద్రాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని